కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

BPT: జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజల నుండి కలెక్టర్ అర్జీలను స్వీకరించారు. ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు.