13 మంది జూదరుల అరెస్టు
అన్నమయ్య: బి కొత్తకోటలో రెండు చోట్ల నిర్వహించిన దాడుల్లో బుధవారం 13 మంది జూదరులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. రాకాటం వారి పల్లె వద్ద పేకాట ఆడుతున్న ఏడుగురిని అరెస్ట్ చేసి వారి నుంచి రూ.2,070 స్వాధీనం చేసుకున్నారు. అలాగే వాయలవంక సమీపంలో జూదమాడుతున్న ఆరుగురిని అరెస్టు చేసి రూ.12,100 నగదును స్వాధీనం చేసుకున్నారు.