VIDEO: పాలకొల్లులో అగ్నిప్రమాదం
W.G: పాలకొల్లు బీవీఆర్ఎం మున్సిపల్ గర్ల్స్ హైస్కూల్ సమీపంలోని ఓ బిస్కెట్ షాపులో ఇవాళ తెల్లవారుజామున అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. షాపు పూర్తిగా కాలిపోవడంతో రూ.9 లక్షలు నష్టం జరిగినట్లు అంచనా. షార్ట్ సర్క్యూట్ వలన ఘటన జరిగినట్లు తెలుస్తోంది. అగ్నిప్రమాదం జరిగిన వెంటనే ఫైర్ అధికారి జానకిరామ్, సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకున్నట్లు స్థానికులు తెలిపారు.