నంది వాహనంపై ఊరేగిన పార్వతీ పరమేశ్వరులు

నంది వాహనంపై ఊరేగిన పార్వతీ పరమేశ్వరులు

CTR: పుంగనూరు టౌన్ శ్రీ సోమేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే ఆరో రోజు గురువారం పార్వతీ పరమేశ్వరులను ప్రత్యేకంగా అలంకరించి, నంది వాహనంపై కొలువు తీర్చారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ వాహన సేవను పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు పార్వతీ పరమేశ్వరులను దర్శించగా.. మహిళలు మంగళ హారతులు పట్టారు.