పీఎం విశ్వకర్మ లబ్ధిదారులకు కుట్టు మిషన్ల పంపిణీ
NRML: దిలావర్ పూర్ మండలం కాల్వ గ్రామంలో శనివారం విశ్వకర్మ లబ్ధిదారులకు PM విశ్వకర్మ యోజన జిల్లా ఇంప్లిమెంటేషన్ కమిటీ మెంబర్ సామ రాజేశ్వర్ కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఈ పథకం ద్యారా అంతరించిపోతున్న చేతి వృత్తులను తిరిగి లాభదాయకంగా మార్చాలనే లక్ష్యంతో, దేశ ప్రధాని నరేంద్ర మోదీ దాదాపు 16 రకాల చేతి వృత్తుల వారికి అతి తక్కువ వడ్డీతో రుణాలను అందిస్తున్నామన్నారు.