రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

KDP: పోరుమామిళ్ల మండలం చెన్నారెడ్డిపేట వద్ద సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. బొలెరో వాహనం బైకును ఢీకొన్న ఘటనలో బైక్‌పై వెళుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. మృతి చెందిన వ్యక్తి ఆర్ అండ్ బి కాంట్రాక్టర్ వెంకట్ రెడ్డి‌గా స్థానికులు గుర్తించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.