పెద్దవంగర తహసీల్దర్‌గా వినోద్ కుమార్
MHBD: పెద్దవంగర మండల నూతన తహసీల్దార్‌గా బలబద్ర వినోద్ కుమార్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ రెవెన్యూ పరమైన సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. అనంతరం రెవెన్యూ సిబ్బంది నూతన తహసీల్దార్‌కు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.