కార్తీక వనభోజనంలో పాల్గొన్న ఎమ్మెల్యే

కార్తీక వనభోజనంలో పాల్గొన్న ఎమ్మెల్యే

ATP: రాప్తాడు మండలం హంపాపురం గ్రామంలో ఆదివారం కార్తీక వనభోజనం మహోత్సవం భక్తి శ్రద్ధలతో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకట ప్రసాద్ హాజరయ్యారు. ముందుగా ఆలయంలో స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి శివుడికి పాలాభిషేకం చేశారు. ఈ కార్తీక వనభోజనంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.