సన్నవడ్లకు రూ. 500 బోనస్: ఎమ్మెల్యే
GDWL: రైతుల సంక్షేమం కోసమే ప్రభుత్వం పనిచేస్తుందని రైతు పండించిన వరి ధాన్యాన్ని చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి అన్నారు. గద్వాల మండలం బాస్రా చెరువు గ్రామంలో సోమవారం ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సన్నవడ్లకు రూ.500 చొప్పున బోనస్ అందిస్తామన్నారు.