పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

MHBD: మరిపెడ పోలీస్ స్టేషన్, సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయాలను నేడు జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాద్ కేకన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలతో పాటు రికార్డులను పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు చేశారు. పోలీస్ స్టేషన్‌కు నిత్యం వచ్చే కేసులతో పాటు పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలను చర్చించారు.