VIDEO: 'పైపులైన్ లీకేజీలు కనిపిస్తే సమాచారం ఇవ్వండి'
PDPL: రామగుండం నగరంలో మంచినీటి పైప్ లైన్ లీకేజీలు కనిపిస్తే వెంటనే 93924 83959 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని మేయర్ మహంకాళి స్వామి కోరారు. శనివారం శాతవాహన పీజీ కాలేజ్ వద్ద లీకేజీ మరమ్మతులను ఆయన దగ్గరుండి పూర్తి చేయించారు. లీకేజీ ఫోటో, లొకేషన్ పంపితే వెంటనే చర్యలు తీసుకుంటామని, వేసవి దృష్ట్యా ప్రజలు నీటిని వృథా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని సూచించారు.