పంటలను పరిశీలించిన జిల్లా వ్యవసాయ అధికారి

పంటలను పరిశీలించిన జిల్లా వ్యవసాయ అధికారి

MDK: రేగోడ్ మండల కేంద్రంలోని వరి, పత్తి పంటలను జిల్లా వ్యవసాయ అధికారి దేవ్‌కుమార్ శనివారం పరిశీలించారు. పంటల్లో నీరు నిల్వ ఉంటే కాలువల ద్వారా బయటకు పంపాలని, వర్షాలు తగ్గిన తర్వాత లీటరు నీటికి 5-10 గ్రాముల మల్టీ K పిచికారి చేయాలని సూచించారు. పత్తిలో వడలు తెగులు వచ్చే అవకాశముందని, నివారణకు లీటరు నీటికి 3 గ్రాముల కాపర్ ఆక్సీ క్లోరైడ్ పిచికారి చేయాలన్నారు.