గడ్డపార పట్టి ఉపాధి పని చేసిన ఛైర్మన్
MBNR: హన్వాడ మండలంలో ఉపాధి హామీ పనులను రాష్ట్ర పంచాయతీరాజ్ సంఘటన ఛైర్మన్ సిద్దేశ్వర శుక్రవారం పరిశీలించారు. వేసవిలో ఈ పనులు కూలీలకు ఎంతో ఆసరాగా ఉంటాయన్న ఆయన, స్వయంగా గడ్డపార పట్టి మట్టి తవ్వి వారిని ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ ఛత్రు నాయక్, సర్పంచ్ జ్యోతి తదితరులు పాల్గొన్నారు.