ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నంబర్, క్యూఆర్ కోడ్
సత్యసాయి: వినియోగదారుల హక్కుల రక్షణకు జిల్లా యంత్రాంగం కొత్త ఫిర్యాదుల వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. రేషన్ సరుకుల పంపిణీ, గ్యాస్ సిలిండర్ ధరలు, పెట్రోల్ బంకుల్లో అక్రమాలపై 08555-288566 నెంబర్ లేదా క్యూఆర్ కోడ్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ తెలిపారు. నిత్యావసర వస్తువుల సరఫరాలో పారదర్శకత కోసం ఈ సదుపాయాన్ని కల్పించామన్నారు.