ఉరేసుకుని ఉపాధ్యాయురాలు మృతి

ఉరేసుకుని ఉపాధ్యాయురాలు మృతి

WNP: వనపర్తి పట్టణంలోని న్యూటౌన్ కాలనీకి చెందిన ఉపాధ్యాయురాలు రాకాసి శ్రీదేవి (45) ఆదివారం తన నివాసంలో ఉరివేసుకొని మృతి చెందినట్లు పట్టణ పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం.. మృతురాలు కొన్ని రోజులుగా మానసిక రోగంతో బాధపడుతున్నదని భర్త పిల్లలు ఇంట్లో లేని సమయంలో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.