డబుల్ సెంచరీతో చెలరేగిన కరుణ్ నాయర్
రంజీ ట్రోఫీ-2025లో వెటరన్ ప్లేయర్ కరుణ్ నాయర్ అదరగొడుతున్నాడు. కర్ణాటక తరఫున బరిలోకి దిగిన అతడు.. తొలి మ్యాచ్‌లో సౌరాష్ట్రపై హాఫ్ సెంచరీ, రెండో మ్యాచ్‌లో గోవాపై భారీ సెంచరీ(174*) సాధించాడు. తాజగా, కేరళతో మ్యాచ్‌లో డబుల్ సెంచరీతో(233) చెలరేగాడు. దీంతో నాయర్‌కు మరోసారి జాతీయ జట్టులో అవకాశం కల్పించాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.