రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి

రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి

KRNL: ఆదోని మెల్టన్ కాలేజ్ సమీపంలో ఓ యువకుడు మృతి చెందిన ఘటన జరిగింది. ఆస్పరి రోడ్డుపై బైక్, లారీ ఢీకొన్న ప్రమాదంలో బైక్ నడిపిస్తున్న యువకుడు స్పాట్‌లోనే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న లారీ డ్రైవర్‌ను పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు. కాగా, మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.