నేడు ఆదర్శ పాఠశాల ప్రవేశ పరీక్ష

నేడు ఆదర్శ పాఠశాల ప్రవేశ పరీక్ష

KMR: జిల్లాలోని తెలంగాణ ఆదర్శ పాఠశాలల ప్రవేశ పరీక్షను నేడు ఆదివారం నిర్వహించనున్నారు. ఉ.10 నుంచి 12 గంటల వరకు ఆరో తరగతి ప్రవేశ పరీక్ష ఉంటుంది. 7వ నుంచి 10వ తరగతి ప్రవేశ పరీక్ష మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు ఉంటుంది. www.tgms.telangana.gov.inలో హాల్ టికెట్లు అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులు నిర్ణీత సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు కోరారు.