ఇంట్లో నుంచి పారిపోయిన యువతి

ఇంట్లో నుంచి పారిపోయిన యువతి

HYD: తల్లి మందలించిందని ఇంట్లో నుంచి వెళ్లిపోయిన కూతురి కథ ఇది. చిలకలగూడ ఎస్సై జ్ఞానేశ్వర్ తెలిపిన వివరాలు ప్రకారం.. మెట్టుగూడకు చెందిన స్వాతి(19) ఇంట్లో ఏ పని చేయడం లేదని తల్లి సుజాత మందలించింది. దీంతో మనస్తాపం చెందిన ఆమె నిన్న ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఎంత వెతికినా ఆచూకీ దొరకలేదని తల్లి PSలో ఫిర్యాదు చేసింది. యువతి ఆచూకీ తెలిసినవారు తమను సంప్రదించాలని ఎస్సై కోరారు.