కేంద్రం నిధులతోనే గ్రామాల్లో అభివృద్ధి: ఈటల
TG: రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా సర్పంచులు చేసిన పనులకు పెండింగ్ బిల్లులు చెల్లించలేదన్నారు. గ్రామాల్లో కేవలం కేంద్ర ప్రభుత్వం నిధులతోనే అభివృద్ధి జరుగుతోందని తెలిపారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కూడా కేంద్రం నిధులతోనే నిర్మిస్తున్నారని చెప్పారు.