డబుల్ బెడ్ రూమ్ కాలనీలో బోరు మోటర్ ఏర్పాటు
MBNR: వీరన్నపేట డబుల్ బెడ్ రూమ్ కాలనీలో ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి ఆదేశాలతో తాగునీటి బోరు ఏర్పాటు చేశారు. శనివారం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో కలిసి కాంగ్రెస్ నేత బండి మల్లేష్ నూతన బోర్ మోటర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాసమస్యల పరిష్కారంలో ఎమ్మెల్యే చూపుతున్న చొరవ అభినందనీయమని, కాలనీ ప్రజల తరఫున ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.