చిల్డ్రన్స్ డే.. విద్యార్థుల అద్భుత ప్రదర్శన

చిల్డ్రన్స్ డే.. విద్యార్థుల అద్భుత ప్రదర్శన

GDWL: మానవపాడు మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో నవంబర్ 14న బాలల దినోత్సవం రోజును పురస్కరించుకొని విద్యార్థులు, ఉపాధ్యాయులు రూపొందించిన ఓ ఆకారం ఆకట్టుకుంటోంది. నెహ్రూకి పిల్లలు అంటే చాలా ఇష్టం, ఆయన పుట్టిన రోజుని చిల్డ్రన్స్ డేగా జరుపుకుంటామని ఎంఈవో శివప్రసాద్ అన్నారు. విద్యార్థులు చక్కగా మానవహారం నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించారు.