ఉద్యోగుల తొలగింపుపై అమెజాన్ క్లారిటీ

ఉద్యోగుల తొలగింపుపై అమెజాన్ క్లారిటీ

14వేల మంది ఉద్యోగులను తొలగించటంపై అమెజాన్ CEO ఆండీ జస్సీ క్లారిటీ ఇచ్చారు. ఉద్యోగుల తొలగింపు అనేది ఏఐ కోసమో, డబ్బు కోసమో తీసుకోలేదని, అది వర్క్ కల్చర్‌కు సంబంధించినదని పేర్కొన్నారు. సంస్థ ఎదుగుతున్న నేపథ్యంలో నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం, నాయకత్వ స్థానంలో ఆలస్యం ఉండకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఈ సంస్థలో 1.5M మంది పని చేస్తున్నారు.