VIDEO: 'సీజనల్ వ్యాధులను నివారణకు టీకాలు తప్పనిసరి'

WNP: జీవాలు సీజనల్ వ్యాధులకు గురి కాకుండా పశు పోషకులు విధిగా వ్యాధి నిరోధక టీకాలు వేయించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. జిల్లాలోని రాజనగరంలో అశోక్ వైద్యాధికారి ఆధ్వర్యంలో గొర్రెలు, మేకలకు వ్యాధి నివారణ టీకాలు వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. తొలకరి వర్షాలకు లేత పచ్చి గడ్డి తినడం వల్ల గొర్రెలు, మేకలు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందన్నారు.