రొళ్లలో పర్యటించిన ఆర్డీవో ఆనంద్ కుమార్

ATP: రొళ్ల మండలంలో పలు ప్రభుత్వ కార్యాలయాలను, పాఠశాలలను గురువారం పెనుగొండ ఆర్డీవో ఆనంద్ కుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు. మండలంలోని తాహశీల్దార్, ఎంపీడీవో కార్యాలయంలో పలు రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం అధికారులతో మాట్లాడుతూ.. ఫిబ్రవరి 1వ తేదీన 100 శాతం పెన్షన్ పంపిణీ జరగాలన్నారు. ఉదయం 6 గంటల నుంచే పెన్షన్ పంపిణీ జరిగేటట్లు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.