శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద

శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం డ్యామ్ 10 గేట్లు ఎత్తి దిగువకు 4,05,124 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్ ఫ్లో 3,38,739 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 881.60 అడుగులకు చేరింది. జలాశయం నిండిన నేపథ్యంలో జలవిద్యుత్ ఉత్పత్తి కూడా కొనసాగుతోంది.