'కోడిగుడ్ల సరఫరాకు మూడు ఈ-టెండర్లు దాఖలు'

KMM: జిల్లాలో మధ్యాహ్న భోజనం మినహాయించి అన్ని గురుకుల విద్యాసంస్థలు అంగన్వాడీ కేంద్రాలకు కోడిగుడ్ల సరఫరా కోసం 3 ఈ-టెండర్లు దాఖలు అయ్యాయని అదనపు కలెక్టర్ డా.పి. శ్రీజ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లో కోడిగుడ్లు సరఫరా ఈ టెండర్లను అదనపు కలెక్టర్ ఓపెన్ చేశారు. నిబంధనలను పాటిస్తూ, తక్కువ ధరకు కోడి గుడ్లు సరఫరా చేసే వారికి టెండర్ అందించడం జరుగుతుందన్నారు.