యువతిని కుటుంబానికి అప్పగించిన పోలీసులు
ఏలూరు రైల్వే స్టేషన్లో మతిస్థిమితం లేకుండా తిరుగుతున్న యువతిని రైల్వే పోలీసులు శనివారం క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు. కాకినాడకు చెందిన నాగేశ్వరిగా గుర్తించిన ఆమెను వన్ స్టాప్ సెంటర్కు తరలించారు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు స్టేషన్కు రావడంతో, అధికారుల సమక్షంలో ఆమెను అప్పగించినట్లు రైల్వే ఎస్సై దానం తెలిపారు.