VIDEO: 'నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు'
SKLM: ఆమదాలవలసలోని అండర్ గ్రౌండ్ దగ్గర ఎస్సై బాలరాజు ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ మేరకు సరైన వాహన పత్రాలు లేని వారికి జరిమానా విధించారు. రోడ్డు ప్రమాదాలు నివారించాలంటే హెల్మెట్ తప్పనిసరిగా ధరిస్తూ ప్రయాణించాలని వాహన దారులను సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.