కడపలో డ్రోన్ కెమెరాలతో నిఘా.!

కడపలో డ్రోన్ కెమెరాలతో నిఘా.!

KDP: గంజాయి సేవనం, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు కడప పోలీస్ శాఖ డ్రోన్ కెమెరాలతో నిఘా కొనసాగిస్తోంది. ఎస్పీ షెల్కే నచికేత్ ఆదేశాల మేరకు CI రెడ్డెప్ప, SI తులసి నాగప్రసాద్ నేతృత్వంలో బుగ్గవంక, వినాయకనగర్, తారక రామానగర్ తదితర ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.