సమ్మక్క, సారలమ్మ జాతర పోస్టర్ ఆవిష్కరణ

TG: మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర పోస్టర్‌ను మంత్రులు సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ ఆవిష్కరించారు. జనవరి 28 నుంచి 31 వరకు మేడారం జాతర జరగనుంది. జాతర నిర్వహణ కోసం ఇప్పటికే ప్రభుత్వం రూ.150 కోట్లు విడుదల చేసింది. అయితే జంపన్న వాగు నుంచి ఊరి వరకు డివైడర్లతో డబుల్ రోడ్లు వేస్తున్నామని సీతక్క తెలిపారు.