నూతన రైస్ మిల్‌ను ప్రారంభించిన మంత్రి
MNCL: జైపూర్ మండలం ఇందారం గ్రామంలో లక్ష్మీ గణపతి నూతన రైస్ మిల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి రైస్ మిల్‌ను ప్రారంభించి, యజమానులకు శుభాకాంక్షలు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి పరిశ్రమలు ఏర్పడటం వల్ల స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అన్నారు.