'జవాన్ మురళి నాయక్ మరణం తీరని లోటు'

MHBD: పాకిస్తాన్ ఉగ్రవాదులపై విరుచుకుపడుతున్న భారత సైన్యానికి కొత్తగూడ కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు వజ్జా సారన్న అభినందనలు తెలిపారు. దేశ రక్షణలో ప్రాణత్యాగం చేసిన అమర జవాన్ మురళి నాయక్ మరణం తీరని లోటు అని పేర్కొన్నారు. సైనికుల వీరత్వం ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతుందని తెలిపారు. యువత ఇలాంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ప్రభుత్వం వారికి అండగా ఉండాలని కోరారు.