టాలీవుడ్ నిర్మాతపై కేసు నమోదు
టాలీవుడ్ నిర్మాత బెల్లంకొండ సురేష్‌పై కబ్జా కేసు నమోదైంది. ఫిల్మ్‌నగర్ రోడ్ నెంబర్ 7లో ఉన్న ఓ ఇంటిని సురేష్ అక్రమంగా కబ్జా చేశారని శివప్రసాద్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తాను కొంతకాలంగా బంధువుల దగ్గర ఉంటున్నానని, ఆ సమయంలో నిర్మాత అనుచరులు ఇంటి తాళం పగలగొట్టి లోపలికి ప్రవేశించారని అందులో పేర్కొన్నాడు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.