మరో ఇద్దరు నిందితులు అరెస్ట్

RR: చందానగర్ ఖజానా జ్యువెలర్స్ దొంగతనం కేసులో మరో ఇద్దరిని పోలీసులు ఈరోజు అరెస్టు చేశారు. అంతర్రాష్ట్ర దొంగల గ్యాంగ్‌కు చెందిన అనీష్ కుమార్ సింగ్, ప్రిన్స్ కుమార్ రజాక్‌లను అరెస్ట్ చేశారు. పూణేలో నిందితులను అదుపులోకి పోలీసులు తీసుకున్నారు. నిందితుల నుంచి ఒక పిస్టల్, 1015 గ్రాముల బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.