'ప్రజా ప్రభుత్వంలో పేదలందరికీ రేషన్ కార్డులు పంపిణీ'
BDK: ఇల్లందు మండలానికి చెందిన 72 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే కోరం కనకయ్య సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఆదివారం పంపిణీ చేశారు. ఈ రెండు సంవత్సరాల కాలంలో ప్రజా ప్రభుత్వం ఎనిమిది కోట్ల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశామని ఎమ్మెల్యే తెలిపారు. గత పాలకులు హయాంలో రేషన్ కార్డు ఊసే లేదని కానీ ప్రజా ప్రభుత్వంలో పేదలందరికీ రేషన్ కార్డులు అందించామన్నారు.