వేసవి క్రీడలను నిర్వహించేందుకు దరఖాస్తుల ఆహ్వానం

వేసవి క్రీడలను నిర్వహించేందుకు దరఖాస్తుల ఆహ్వానం

నిర్మల్: జిల్లా కేంద్రంలో వేసవి క్రీడలను నిర్వహించేందుకు అర్హులైన PETల నుంచి, సీనియర్ క్రీడాకారుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు DYSO శ్రీకాంత్ రెడ్డి ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈనెల 15వ తేదీలోగా కలెక్టరేట్ DYSO కార్యాలయంలో సమర్పించాలని తెలిపారు. అర్హులను ప్రకటించి వేసవి క్రీడా శిబిరాలను నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు.