ముంబైకి తొలి మహిళా కమిషనర్‌గా అశ్వినీ
బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్(BMC) చరిత్రలో అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది. తొలిసారిగా BMC కమిషన్‌గా IAS అధికారిణి అశ్విని భిడే నియమితులయ్యారు. ఈ పదవి చేపట్టిన తొలి మహిళగా ఆమె చరిత్రకెక్కారు. ప్రస్తుత కమిషనర్ భూషణ్ పదవీకాలం ముగియడంతో ఆయన స్థానంలో అశ్విని బాధ్యతలు స్వీకరించారు. 1995 బ్యాచ్ IAS అధికారిణి అయిన అశ్విని.. గతంలో CMOలో అదనపు ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు