రోడ్డు కోసం మంత్రికి వినతి పత్రం అందజేత

రోడ్డు కోసం మంత్రికి వినతి పత్రం అందజేత

JGL: బుగ్గారం మండలం చందయ్య పల్లె గ్రామ యువకులు తమ గ్రామం నుంచి మండల కేంద్రం బుగ్గారం వరకు బీటీ రోడ్డు ఏర్పాటు చేయాలని కోరుతూ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. రోడ్డు లేకపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ధర్మపురి క్యాంపు కార్యాలయంలో మంత్రిని కలిసిన యువకులు, రోడ్డు నిర్మాణంపై త్వరితగతిన చర్యలు తీసుకోవాలన్నారు.