నేడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం

నేడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం

ASF: కాగజ్ నగర్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయ ఆవరణలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ప్రారంభించనున్నట్లు పీఏసీఎస్ సీఈవో సతీశ్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ మద్దతు ధర క్వింటాలుకు రూ.2400 చెల్లిస్తామని పేర్కొన్నారు. రైతులు ఎండబెట్టి శుభ్ర పరిచిన తర్వాత మార్కెట్ యార్డుకు మక్కలు తీసుకురావాలని సూచించారు.