మూడవ డివిజన్‌లో పర్యటించిన మేయర్
మహబూబ్ నగర్ కార్పొరేషన్ పరిధిలోని మూడవ డివిజన్ అప్పన్నపల్లిలో మేయర్ గుమ్మాల మమతా శ్రీనివాస్ ముదిరాజ్, మున్సిపల్ కమిషనర్ రామానుజులు రెడ్డి మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా డివిజన్ పరిధిలో జరుగుతున్న పారిశుధ్య చర్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పారిశుద్యం విషయంలో ఎటువంటి నిర్లక్ష్యం వహించకూడదని సూచించారు.