గంపలగూడెం వాసికి డీఎస్సీలో తృతీయ స్థానం

NTR: గంపలగూడెంకి చెందిన కోట నాగరాజు డీఎస్సీ ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచారు. స్కూల్ అసిస్టెంట్ (గణితం) విభాగంలో 100 మార్కులకు 82.56 మార్కులు సాధించి ఉమ్మడి కృష్ణా జిల్లాలో తృతీయ స్థానంలో, అలాగే కృష్ణా జిల్లా ఎస్సీ కేటగిరీలో ప్రథమ స్థానంలో నిలిచారు. ఈ సందర్భంగా నాగరాజు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువులు ఆయనకు అభినందనలు తెలిపారు.