రేణుక ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు
NLG: ధర్వేశిపురంలో స్వయంభూ శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారికి సోమవారం ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. పూజారి నాగోజు మల్లాచారి ఆధ్వర్యంలో పంచామృతాభిషేకాలు, కుంకుమ పూజలు జరిగాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఈవో నాగిరెడ్డి సమక్షంలో తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.