రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
W.G: నరసాపురం 216 జాతీయ రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నామాని గోపాలకృష్ణ (55) అనే వ్యక్తి మృతి చెందాడు. థామస్ బ్రిడ్జి వద్ద రోడ్డు దాటుతుండగా బైక్ ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. సంఘటనా స్థలానికి చేరుకున్న నరసాపురం రూరల్ ఎస్సై టి.వెంకట సురేష్, బాధితుడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, వైద్యులు అతడు మృతి చెందినట్లు నిర్ధారించారు.