'డిగ్రీ కళాశాల తరగతులు ప్రారంభం'
SRD: ఈనెల16 నుంచి పటాన్ చెరువు ఏపీజే అబ్దుల్ కలాం ప్రభుత్వ డిగ్రీ కళాశాల తరగతులు ప్రారంభం కానున్నాయని ప్రిన్సిపల్ వడ్లూరి శ్రీనివాస్ తెలిపారు. 2025- 2026 విద్యా సంవత్సరానికి గాను విద్యార్థులకు తరగతులు ప్రారంభిస్తున్నామని ఆయన వెల్లడించారు. ఈనెల 15న మధ్యాహ్నం 2 గంటలకు కాలేజీ ప్రాంగణంలో ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఉంటుందని.. విద్యార్థులు హాజరుకావాలని కోరారు.