ఏపీ గురించి ప్రపంచం మాట్లాడుతోంది: రామ్మోహన్

ఏపీ గురించి ప్రపంచం మాట్లాడుతోంది: రామ్మోహన్

AP: విశాఖలో నిర్వహించిన సీఐఐ సదస్సులో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. 'ఈ రోజు మేం కేవలం సీఐఐ సమ్మిట్‌ను మాత్రమే నిర్వహించడం లేదు. దీని ద్వారా ఓ విజన్‌ను తీసుకొస్తున్నాం. కొన్నేళ్ల క్రితం ఎలాంటి దిశా నిర్దేశం, విజన్ లేకుండా ఆంధ్రప్రదేశ్ ఇబ్బందులు పడింది. ఇప్పుడు రాష్ట్రం గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుతోంది' అని పేర్కొన్నారు.