జిల్లాలో స్పాట్ వాల్యుయేషన్ ప్రారంభం
కృష్ణా: మచిలీపట్నంలోని నోబల్ కాలేజ్‌లో ఇంటర్ పరీక్షల స్పాట్ వాల్యుయేషన్ ఆదివారం ప్రారంభమైంది. జిల్లాకు 2 లక్షల సమాధాన పత్రాలు వచ్చాయని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారిణి సరళా కుమారి తెలిపారు. 225 మంది ఎగ్జామినర్లను నియమించగా ఒకొక్కరు రోజుకు 30 సమాధాన పత్రాలను వాల్యుయేషన్ చేస్తారన్నారు. వాల్యుయేషన్‌లో పాల్గొనే సిబ్బందికి అన్నిరకాల వసతులు కల్పించినట్లు తెలిపారు.