రాష్ట్రపతిని కలిసిన వరల్డ్ కప్ విజేతలు

రాష్ట్రపతిని కలిసిన వరల్డ్ కప్ విజేతలు

ICC ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచిన భారత జట్టు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును కలిసింది. ఈ మేరకు రాష్ట్రపతి భవన్‌కు వెళ్లిన అమ్మాయిలు.. ముర్ముకు జెర్సీతో పాటు ట్రోఫీ అందజేశారు. ఈ సందర్భంగా వారిని అభినందించిన ముర్ము.. ‘ఫైనల్ మ్యాచ్ విన్నింగ్ మూమెంట్స్ నేనూ చూశా. టోర్నీ ప్రారంభానికి ముందే మీరు కప్ సాధిస్తారనే నమ్మకం నాకు ఉంది’ అని అన్నారు.