పరిశుభ్రతతోనే వ్యాధుల నివారణ సాధ్యం: కలెక్టర్

పరిశుభ్రతతోనే వ్యాధుల నివారణ సాధ్యం:  కలెక్టర్

గుంటూరు లాలుపురంలో నిర్వహించిన “స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు సమాజ పరిశుభ్రతను పాటించడం ద్వారా అనేక రకాల వ్యాధులను ముందుగానే నివారించవచ్చని తెలిపారు. అనంతరం విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.