'అండర్ బ్రిడ్జ్‌లో నిలిచిన నీటిని వెంటనే తొలగించాలి'

MBNR: పాలిటెక్నిక్ రైల్వే అండర్ బ్రిడ్జిలో నిలిచిన నీటిని వెంటనే తొలగించాలని కలెక్టర్ విజయేందిర బోయి అధికారులను ఆదేశించారు. గురువారం ఆమె అండర్ బ్రిడ్జి ఉన్న ప్రాంతాన్ని పరిశీలించారు. వర్షాల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం వరద ప్రాంతాల్లో పర్యటిస్తూ, పర్యవేక్షణ కొనసాగిస్తూ, సమస్యలను తక్షణమే పరిష్కరించాలన్నారు.